పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/227

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది యెనిమిదవ ప్రకరణము

209


చున్నది. ఇందుకు మనవారుకూడఁ గొంత కారణమే. మన నవాబులలోఁ జాలమంది కాఫరులను మంత్రులను గాను, సేనానాయకులను గాను జేయు చున్నారు. ఇది యెంతయు హానికరము, పాపకార్యము.


నవాబు:- అది సత్యమే. ఆశక్తి తురుష్కులకుందక్క హిందువు లకు లేనే లేదు. ఈ మధ్యనొక ఫకీరు నాతో, ఇట్లే చెప్పి యున్నాఁడు. ఒక ఫకీరేకాదు, చాలమంది ఇట్లే చెప్పుదురు. అందుచేత నేను నాగొప్ప యుద్యోగములనన్నిటిని మనవా రికేయిచ్చితిని. అది మనధర్మము. పాలకులముగా మనము దేవునిచే విధింపఁబడితిమి. వారు మనకు బానిసలు. వారిని బాలకులనుగాఁ జేసి గౌరవించుట తప్పే.


మంత్రి :- ఈయొక్క విజయనగర సామ్రాజ్యమువలన వారి యాటలు సాగుచున్నవి. విజయనగర రాజులకుఁ గ్రమక్రమ ముగాఁ .గండ్లు పొరలు క్రమ్ముచున్నవి. భరతఖండమునఁ దమంత వారు లేరని విఱవీగుచున్నారు. గోల్కొండ రాష్ట్రము నవక్ర పరాక్రమమున జయించి ఘానుపురదుర్గము ను, బానగల్లుదుర్గమును లాగుకొన్నారు. అంతటితో వారు తమమదమును విడువ లేదు. అతఁడిపుడు మన రాయ బారులను సరిగా పూర్వమువలె మన్నించుట మానినాఁడు. మన రాయ బారు లిపుడతనిముందు నిల్చుండి మాట్లాడవలయు నట! ఎంతకష్టము! అతనితోఁగూడఁ బ్రయాణము చేయు