పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/226

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

208

విజయనగర సామ్రాజ్యము


నవా: తురుష్కులతో దురుష్కులు కలహించుటచేతనే మీరన్నట్లే విజయనగర సామ్రాజ్యము ప్రక్కలోని బల్లె మట్లు వర్తించుచున్నది.


మంత్రి: దీని నణగదొక్కి తీరనలయును. కాఫరులను హిం సించుటయు, వారిని మతములోనికిఁ జేర్చుటయు మన ధర్మ ము. హిందూ దేశములఁ దక్కిన భాగములయందు, కొద్ది గనో గొప్పగనో హిందువులు మనమతమును స్వీకరించిరి. కాని యీ రాక్షసిమూలమున మసమీ దక్షిణ హిందూ స్థానమున నొక్కని నేని మనమతమునం జేర్పలేకపోతిమి. దీనిని నాశము చేయకుంటి మేని మన మాన ప్రాణములు దక్కవు.


నవాబు:-నిశ్చయము. డేవుని యపరావతారమనందగిన మహ మ్మదుగోరి హిందూ జేశమున సామ్రాజ్యమును స్థాపించిన తరువాత, ఇంతటి సుప్రసిద్ధత సృష్ట సామ్రాజ్యము మరలఁ బుట్టియుండ లేదు. ఇది క్రమక్రమముగా మన రాజ్యము లంగూడ మ్రింగునట్లు తోచుచున్నది.

. మంత్రి:- దేవా ! హిందువులు మంత్రిత్యాది మహోన్నత పద వులను బొందుటగాని రాజ్యములను చాలించుట గాని దేవుఁడయిన అల్లా కిష్టము కాదు. కాని యిది, పాపకాల మగుటచే హిందూ సామ్రాజ్యములు జనించుటయు హిందు వులు మంత్రిత్వాదులను వహించుటయుఁ దటస్థించు