పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/223

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియేడవ ప్రకరణము

205


మఱికొందఱు జయ ప్రార్థనలు సల్పిరి. 'ఆంధ్ర మాతకు జయ్ జయ్' అను శబ్దములు దిగంతములం బ్రతిధ్వనించు చుండెను. సైన్యము పెక్కు చిన్న చిన్న భాగములుగా విభ జింపఁబడెను. అట్టి పెక్కు చిన్న భాగముల పైన నొక్క సై న్యాధికారి నియమింపఁబడెను. వీరిక్రింద నుప సైన్యాధి కారు లుండిరి. సైన్యాధి కారుల పైనఁ బ్రధాన సేనానాయకు లుండిరి. సైన్యములోఁ బ్రతిభాగమునకును సమస్త పదార్థాములు తెప్పించి యిచ్చు నంగళ్ళు స్థాపింపఁబడెను. శాకములు, భోజన సామగ్రులు, మిఠాయిలు, పండ్లు, ఫలములు,సర్వపదార్థ ముల నాయంగళ్ళలో నమ్ముచుండిరి. ప్రపంచములోనే భాగ మునను గానరాని గొప్పగొప్ప వైద్యులా సైన్య సముద్రమున నుండిరి. వారెట్టి గాయములనైనను నిముసములో గుదుర్ప గలరు. వా రెఱుఁగని చికిత్సలుగాని మార్గములుగాని లేవు. వారిదగ్గఱఁ జిత్రములయిన పనిముట్లుండెను. నాని సాహాయ్య మువలన వారు వెంట్రుకలను నిలువుగా రెండుగాఁ జేయఁగలరు. అంతసూక్మమైన శస్త్ర సాధనములు నేఁడైనఁగలవా ?

ఈభటులకుఁ గావలసిన యంశములను వస్తువులను సేక రించి తెచ్చుటకుఁ దగినంతమంది సేవకులు నియోగింపఁబడిరి. వారెప్పుడే కార్యము చేయవలసిన నప్పుడు దానిని జేయ నడుము కట్టుకొని సన్నద్ధులై యుండిరి. ఆ సైన్యమునకు, బియ్యము, రొట్టెలు, సంభారములు, మొదలగు సర్వవస్తువులు సంసిధ్ధము