పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/221

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియేడన ప్రకరణము

203


మున నుండఁజాలను. శత్రువుల పశము వహింప వలసివచ్చును. అప్పుడు మీరు క్రోధము వహించినను లాభము లేదు.” ఇది గోరుచుట్టుపై రోఁకలిపోటాయెను. ఆంధ్రుల కిది మఱింత కోపమును గల్గించెను. ఈ యాదిల్నాహాకు రామరా జిదివఱకుఁ బెక్కు యుద్ధములలో సాయము చేసెను. ఇతర తురు ష్కులు తనపై దాడి వెడలినపు డెల్ల వచ్చి రామరాజు పాదములు పట్టుకొను చుండువాఁడు. అతఁడు దయఁదలఁచి తన సైన్యము లను సాయమంపి యతనిని రక్షించుచుండు వాఁడు, ఇట్లు పెక్కు గొప్ప యుద్ధములలో రామరాజితనిని గాపాడెను. వేయేల ? రామరాజు సాయము లేకున్నచో, ఆదిల్శాహాను దదితర తురు ష్క ప్రభువులు పాతాళ లోకమునకుం డ్రొక్కివైచి యుందురు. తనవలన నింత సాయము పొంది, తనదగ్గఱకు వచ్చి నాయనా ! తండ్రీ !' యని పిల్చుచుండు ఆదిల్శాహా లోలోపలఁ దనరాజ్య ములోనే కుట్రలు పన్ను చుండెననియుఁ దన కిట్టివార్త నంపు ననియు నుదారహృదయుఁడగు రామరాజెఱుఁగఁడు. ఆదిల్శాహా తియ్యని పలుకులు విన్న వారు నిజముగా, అతఁడు రామరాజును భక్తిచేతనే అట్లు పిల్చుచున్నాఁడని తలఁచిరి. అందుచే వారుకూడ తుదకతఁడిట్లు చేయునని యెఱుఁ గరు. సమ్మకము గలవారు పరుల హృదయమును, రాఁబోవు కష్టములను గని పెట్ట నేరరు.