పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/220

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

202

విజయనగర సామ్రాజ్యము


దకము లైన గీతములచే పూర్వపుటాంధ్ర యోధుల సుప్రసిద్ధ కీర్తిని, శౌర్య ధైర్యములను గీర్తించుచుండిరి. గోల్కొండ సైన్యమును నాశముచేసి నవాబును బ్రాణములతోఁ బట్టుకొని తెచ్చి యిచ్చుటో లేక యుద్ధరంగమునఁ బ్రాణములు విడిచి వీరస్వర్గమును బొందుటో కావింతుమని నిర్భయముగాఁ ద్రిక రణశుద్ధిగా వాగ్దానములను జేయుచుండిరి.

కృష్ణానది మొదలు కన్యాకుమారివఱకునుగల యాంధ్ర సామ్రాజ్యమునందలి యెల్ల రాజులు,జమీందారులు, రాష్ట్ర పొలకులు, ఉన్నతోద్యోగులు, బాలకులు, యౌవనులు వృద్ధులు, పిన్నలు, పెద్దలు, అందఱును గలిసి యాంధ్ర జాతీయ కీర్తనములు చేయుచుఁ దమకు జయమిచ్చి తను దేశమునకు యశముఁ గూర్పనలయుసని దేవునిం బ్రార్థింపఁగడంగిరి. కొం చెము జ్ఞానము పౌరుషమునుగల ప్రతివీరుఁడును వచ్చి సామ్రాజ్య సైన్యమునం జేరుచుండెను.

ఇంతలోఁ దుచ్చుఁడును బాపియుఁ గ్రూరాత్ముఁడు నగు ఆదిల్శాహా రామరాజునకిట్లు కబురుపంపెను ! "మీరు నారాజ్యములోనుండి పూర్వము తీసికొన్న దుర్గములను నాకిప్పింపుఁడు. నేను మీయందు యధాపూర్వక మగు భక్తితో నేయుండి విపక్షమునంబోరాడెదను. ఆయా దుర్గములనీయక మీరు తిరస్కరించినయెడల నేను విపక్ష