పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/218

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

విజయనగర సామ్రాజ్యము


దన్ను సాధించునని భయము. అతఁడు రేపు జఱుగనున్న మహాయుద్ధమునకు వచ్చుట చక్రధరునకుఁ బెక్కు విధముల నష్టము. తనయెత్తులకు నెదురెత్తులు పన్నును. విఘాతములు కల్పించును.

అందుచే నతఁడు చాలమంది చారులను సంపాదించి దేశ దేశములకును బంపెను. ఎక్కడఁ గన్పడినను స రే, అతనిం ద్రుంచి శిరస్సును రహస్యముగాఁ దెచ్చి తనకిచ్చిన వారి కేబది వేలరూపాయిల నిచ్చెదనని యేకాంతమున నాచారులకుం జెప్పి పంపెను. ఆచారుల పైనఁ గొంద రధికారులను నియోగిం చెను. వారెప్పటి వార్తల నప్పుడు తనకు రహస్య మందిరములలోఁ జెప్పు సట్లేర్పటి చెను. ఇప్పుడు తానే మంత్రియు సర్వాధికా రియు నై నందునఁ గోశధనమును స్వేచ్ఛగా వెచ్చించుచుండెను. అతనికిఁ బ్రతి విషయమునను, తారానాధుండును, ఆదిల్శాహా యుం దోడ్పడుచుండిరి. తారానాథుఁ డెప్పటి విషయము నప్పుడే గోల్కొండకుఁ బంపుచుండెను.