పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/214

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరు వ దియా ర వ ప్రకరణ

కాల కూటము

'జ్ఞాతి శ్చేదన లేనకిం' అని యొక నీతిశాస్త్ర వేత్త వక్కా ణించెను. జ్ఞాతులలోఁ బరస్పర వైరము స్వాభావికముగాఁగల్లు చుండును. ఒక తల్లికడుపునం బుట్టుటయా వివాద హేతువు ! అథ్లెంతమాత్రమునుఁ గాజాలదు. ముందుఁ బరస్పరము కల హింపనున్న సోదరులే బాల్యావస్థయం దత్యంత ప్రేమతో మెలంగుచుందురు.

'మాతాపుత్ర విరోధాయ హిరణ్యాయ నమోనమః' అని మఱియొక కవి చమత్కరించెను. నిశ్చయముగా ధనమే ప్రధాన వైరకారణము. అచ్చటనే సోదరులకుఁ గక్షలు, విరో ధములు. సర్వమునకు నదియే కారణము !

కాని యౌదార్య వృత్తిగలవారికి సమయోత్పన్న మగు నాక్రోధము చిరకాలమువఱకు నుండదు. వెంటనే నశించును. ప్రపంచము పెక్కురీతులు. కొందఱుకా భానమే కలుగదు. మఱికొంచఱు నాఁటివైరమునే సర్వకాలమును లోన నుంచు కొందురు. వారే విషపూరిత హృదయులు.

రాజకుమారులకుఁగల్గు నైరము దీనికింజాల , భిన్నమై నది. ఒక తండ్రి కడుపునఁ బుట్టినవారిలో నొకఁడు రాజగును.