పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/213

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము

195


యతనిని గట్టిగాఁ గాఁగిలించుకొనెను. పాప మెందుచేతనోకాని యారసికున కది కష్టముగాఁదోఁచెను. గిలగిల తన్ను కొనెను. కాని పట్టువీడ లేదు. ఆ సుందరి యిట్లు పలికెను.

'కాముకుఁడా !! -వీరు సుందరీమణులు కారు. ఆంధ్ర వీరులు. నీ బలముం' జూపుము'

అని యెత్తి యతనిం గుదిలించి నేల పై విసరి వేసిత్రొక్కి పట్టెను.

ఆ యిరువురు సుందరీమణుల మేలిముసుఁగులు నొక్క పరి క్రిందఁబడెను. పరాక్రమమును సూచించు నిరువు రాంధ్ర వీరుల ముఖములు కుయుక్తిపరునియెదుటఁ బ్రకాశించు చుం డెను. ఒక్క దెబ్బతో నతఁడు గతించెను. ఆ యిరువురు నందు స్నానము చేసి విజయనగరము దారింబోవఁ జొచ్చిరి.