పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/212

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

194

విజయనగర సామ్రాజ్యము


నివర్తించుకొన్నట్లే యా చెఱువునందలి జలములలో స్నానము చేసి తనకలుషముంగూడఁ బోగొట్టుకొనందలంచి స్నానము చేసెను. ఎన్ని పాపములుచేసినను నరుఁడు గంగాస్నానముం జేసెనేని యవియన్నియు నసీంచునని యతని నమ్మకము కాబోలు!

అతని హృదయము హర్ష ప్రపూర్ణమాయెను. శరీరము నంగల రక్తముపోయి నిష్కల్మషమాయెను. వెంటనే బయటికి వచ్చి క్రొత్త దుస్తులు తొడిగికొనెను.

అప్పుడే ప్రొద్దు పొడుచుచుండెను. ఆసుందరీమణులా స్థలముననే, అట్లే కూర్చుండియుండిరి. ఆ మేలిముసుఁగులు తీయ లేదు. ఆ మందహాసము తగ్గ లేదు. అత్యాతురతతో నతఁ డచటికంబోయెను . "సుందరీమణులారా ! ఇఁక నన్ను ననుగ్రహింపుఁడు ”

అనెను. ప్రత్యుత్తరము లేదు. మందహాస మే.

“మీ మేలిముసుఁగులు తీసి మీ కటాక్ష వీక్షణములచే నన్ననుగ్రహింపుడు”

మరల మందహాసమే.ప్రత్యుత్తరము లేదు. కాని 'మౌనమర్ధాంగీకార' మని యతఁ డుప్పొంగుచుండెను. "మీరు ముగ్ధలు. మీకు సిగ్గు స్వాభావికము.' అని యాసరసుఁ డందొక్క సుందరిని ముద్దు పెట్టుకొనెను..ఆమె