పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/211

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియైదవ ప్రకరణము

193

03


ములలోనే యొక చెట్టుండెను. ఆ చెట్టేమి చెట్టో, దానిపుల్లలు పల్లు దోముకొనుటకు పనికివచ్చునో రావో, అతఁడు పరీక్షించి చూడ లేదు. పై కెక్కి పుల్లలను విఱుచు చుండెను. ఆ చెట్టు క్రింది కేగి కుయు క్తి పరుఁడు పై నుండి పడు చున్న పుల్లల యాకులు దీయు చుండెను.అతఁడు నాల్గ యిదు పుల్ల లుకోసి 'యిక చాల్లే అని దిగివచ్చుచుండెను. కుయుక్తి పరుఁడు పుల్లల యాకులు తీయుచున్నట్లు నటించు చునే ఆ చెట్టు మొదలు దగ్గఱకు వచ్చెను. ఆస్కంధము మిక్కిలి పొడనై నది, లావయినది. ఆ భటుఁడు దానిని గౌఁగిలించుకొని ప్రాకుచు క్రిందికి నచ్చుచుండెను. మానిసి యెత్తువఱకును రాగనే మన కుయుక్తిపరుఁడు బొడ్డలోనున్న ఖడ్గముందీసి యాభటుని కుడి డొక్కలో నొక పెద్దపోటు పొడిచెను. “ఛీ! కుక్కా! యెంతపన్చేశావురా!' అనుచు నాతఁడు క్రిందఁబడెను. అతనిపండ్లు పటపటమనుచుండెను. అతఁడొకసారి కా లెత్తి కుయుక్తిపరునిం దన్న(బోయెను. కాని సాధ్యము కా లేదు. బాధ హెచ్చెను. గిలగిల కొట్టుకొనుచుండెను. ఇంతలో మఱి యొక పోటు వచ్చి కరమునం దగిలెను. పాప మతఁడు ప్రాణములు విడిచెను!

మన కుయుక్తి పళుని హృదయము పరిపూర్ణానంద మయమై పోయెను. అతని సంతసమునకు మేర లేదు. అతని భయము సందేహము సర్వము నాశనూయెను. భయ సందేహములను

13