పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

విజయనగర సామ్రాజ్యము


ప్రదేశ మొకటుండెను. ఆ ప్రదేశము సకలవిధ లతాసంకులమై నానావిధ తరు సంతతులచే నొప్పారుచుఁ జూపఱకు నానంద దాయకముగానుండెను. అందొక విశాలమగు నుటజముకల దు. అందు మునులుందురు. అది ప్రకృతము శ్రీధరుఁడను నొక యోగి సత్తముని యధి కారమున నుండెను.


ఆయుటజమునకుఁ గొంతదూరమున, దాని యావరణ మున నే, చిన్న మండప మొకఁటుం డెను. దాని పై గృష్ణాజినము పజిచియుండెను. అందు మన శ్రీధరుఁడు చేతనొక వీణెను గైకొని పాడుచుండెను. అపుడపుడే తూర్పు తెల్ల వారెను. ప్రపంచ మెల్ల నిశ్చలమై మందసమీర సౌరభ సౌభాగ్య విభా సురముగాఁ దోచుచుండెను. నిర్భయముగా హరిణకిశోరము లతని ప్రక్కలఁ దృణాంకురములం గొణుకుచు బహువిధముల గంతులిడఁ జొచ్చెను.

అతఁడు కనులు మూసికొని పాడుచుండెను.అగీతమమరలోక విలాసినీ ప్రస్తుతి పాత్రము. మధురము, అన్యదుభము. ఆగాన సారస్య సౌభాగ్యము చవిఁగొన్న వారికిని, అప్పటి యా ప్రకృతి నిశ్చల భావమును నైర్మల్యమును గన్న వారికి, ప్రపంచ మెల్ల నతని యలోక సామాన్య, సుభగ, సంగీత సార స్యమును గ్రోలుచుఁ దన్మయావస్థం జెందెనని తో పకపోదు. కాని, యామృదుమధురగానముతోఁబోల్చి చూడ గోరియో లేక తనకంటె నధికుఁడను విచారముననో చెప్పఁజాలము కాని;