పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/206

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

188

విజయనగర సామ్రాజ్యము

.

డందుముంగి యుబ్బి తబ్బిబ్బు లగుచుండెను. ప్రాకృత జను లల్ప సంతోషులు. వారికిఁగల్గు సుఖదుఃఖాది భావములు వారిచే గో పనము చేయఁబడక పయికిఁ జక్కగాఁ బ్రస్ఫుటమగు చుండును. అట్టివారికి దూరదృష్టి యుండదు.

"సిత్తం. సిద్దంగున్నా నుండి "

“సరే, కొంచెము సేపు తాళు '

ఆ కుయుక్తిపరుఁడు తనదృష్టి నిపుడు స్వర్ణ కుమారి వం కకుంద్రిప్పెను. ఆమెను మెల్లఁగాఁబిలిచెను. ఆమెకుఁ దనయుద్దే శము నెల్లజెప్పెను. ప్రత్యుత్తరమియ లేదు గాని యామె కటాక్షమాపనిచేసెను. అది యా కుయుక్తిపరుని మోము దమ్మిపై బ్రసరించి యతని హృదయముం గొల్లఁగొనెను. అతఁ డా యర్థమును గ్రహించెను.

“మేము కార్యమున కుపక్రమింప వచ్చునా ? ' అని యతఁడు పల్కెను. కొంచెము సేపువఱకు జవాబు రాలేదు. కాని యెట్ట కేలకిట్లు మెల్లఁగా వినఁబడెను.

  • వీరు పోట్లాటయందు మిక్కిలి సమర్ధత కలవారు.

ఆయుధముల నిచ్చినచోఁ దగినంత సాయమును మీకుఁ జేయఁ గలరు"

ఆ వాక్యములతనిని పరవశత నొందిం చెను.' అతఁడొక నిముసము ప్రపంచమును మఱచెను. తన ప్రక్కనున్న, భటుని దగ్గ జనుండి రెండు బల్లెములను గైకొని యా సుందరీమణి