పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విజయనగర సామ్రాజ్యము

మొదటి ప్ర క ర ణ ము

• Breathes there the man, with soul so dead, Who never to himself hath said, This is my own, my native land, Sir Walter Scott.

యోగి,

మనమున్న యీశతాబ్దమిరువదియవది. కాని యిపుడు మన మొక సారి 16 న శతాబ్దము వంకఁ జూడవలసియున్నది. కాల మొక తీరుగానుండదు. అది చక్రమువంటిది. క్రిందు మీఁ దగును, మీఁదు క్రిందగును. ఆకాలమున బ్రస్తుతము హంపీ విరూపాక్ష మనుచోట జగద్విఖ్యాతమగు నగర మొకఁటికలదు. అది విజయనగరము. తుంగభద్రాస్రవంతీ తుంగ తరంగ మా లికా దౌతోత్తరభాగము. తన్న గర రక్షణమునకుఁగాను బర మేశ్వరుండు నిర్మించిన యత్యున్నత కుడ్యజాలములో యన నొప్పు కొండగుట్ట లాప త్తనపుఁ బూర్వదక్షిణ పశ్చిమ భాగ ముల వెలయుచుండెను. ఇట్లు స్వాభావిక సృష్టి, సౌభాగ్య రాను లయిన 'యాపర్వతములలో నొక చోట మిక్కిలి ఎత్తయిన