పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

178

విజయనగర సామ్రాజ్యము



అని యావీరులు ప్రతి వాక్యములు వచించిరి. అందఱు గుఱ్ఱముల నొక్కపరి వెన్క కుంద్రిప్పిరి. వారిపై బడిరి. ఒకరితో నొకరు దాక్కొనిరి. స్వర్ణ కుమారీ జగన్మోహినులుకూడ యుద్ధ సన్నద్ధలయి శత్రువులను హింసించుచుండిరి. నిముసములో పోరు ఘోర మాయెను. ప్రాణముల పై నాశవదలి యిరు దెసలవారును బోరుచుండిరి. రక్తము కాల్వ లుగట్టెను. యోధులందఱ దేహములు రక్త మయము లయ్యెను. వస్త్రములు రక్తమయములయ్యెను. హస్తములు రక్తమయములాయెను. పాదములు రక్తమయములు. శిరములు రక్తమయములు ! తెల్లగా వెండివలె నంతకుఁ బూర్వము మెరసిన ఖడ్గము లిపు డెఱగా మెరయుచుండెను !

నవాబు పట్టమహిషిని ముద్దు పెట్టు కొనివచ్చిన యాయిరు వురు రాజకుమారులవంకఁ జూడుడు ! అంగము లెంత రమ్యములుగా నున్నవో ? వారిరువురను జూచినంత నేశత్రువులకుం గూడఁ గొట్టుటకుఁ జేతులువచ్చుట లేదు. కాని యుద్ధము. ఒకరు కొట్టిన మఱియొకరు ముద్దు పెట్టుకొందురా ! అది యెక్కడ నేని కలదా ! పాపము ! వారిరువురును రక్తముతోఁ దడపఁబడిరి. అదిగో ! పాపము ! రాధాకుమారునివంకఁ జూడుఁడు ! కండ్లు మిఱుమిట్లు గొనుచున్నవి. ఆ భయంకర మూర్తిని జూడ లేము. లేళ్ళపై: విజృంభించిన కొదమ సింగమువలె నతని మూర్తి ప్రకాశించు చుండెను. ఒక రింబొడుచుచు, ఒక నిం