పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది మూఁడవ ప్రకరణము

ప్ర యా ణ ము

మనుష్యుల జీవితముల వలెనే వారికింగల్గుకష్టసుఖము లుకూడ క్షణభంగురములు. ఇపుడు సంతోష తరంగముల మధ్య మునింగి యుందుము. కాని క్షణకాలములో మనను మ్రింగి వేయ నోరు దెఱుచికొని యున్న దుఃఖ పరంపరను మన మెఱుంగఁజాలము. యుఁ ల స్వర్ణకుమారీ జగన్మోహినులును సోమ శేఖరమూర్తి దద్ధర్మపత్నియు, రాధాకుమారుఁడును, కొంత పరివార ముతో, గుఱ్ఱముల పై నెక్కి

స్వారిచేయు చుండిరి.నిముషములు, గడియలు గడచుచుండెను. 

గుఱ్ఱములు సాధ్యమైనంత వేగముతోఁ బరువిడుచుండెను. చెట్టులు గడిచి పోవుచుండెను. గుట్టలు గడిచిపోవుచుండెను. పుట్టలుగడచి పోవుచుండెను. పల్లములు మెరకలు గడిచిపోవుచుండెను. ఎవ రేవయిపు నుండి వచ్చి తమ్ముంబట్టుకొందురో యమభయముచే వారెడతెగక యొక్కరీతిగా గుఱ్ఱములం బరుగెత్తించుచుండిరి. మైళ్లు, క్రోశములు యోజనములు గడచి పుచుండెను.