పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

172

విజయనగర సామ్రాజ్యము


ఆ యిరువుకును బెనగులాడిరి. వెంటనే యా యున్నత విగ్రహ మొక్కపోటున నతనింగూడఁ గూల్చెను. అతఁడు విజయసింహుఁడు. ఈ సందడి ప్రారంభింపఁగ నే శ్రీధరుఁడు వెన్కనుండివచ్చి యకస్మాత్తుగా బైనఁబడి బండి వానిం దునిమెను.

ఆ రెండవవాఁడు పాఱిపోవఁజూ చెను. కాని శ్రీధరుఁడు వెంటనంటి తరిమి పట్టుకొని యతనింగూడ వారితో బాటు విగత ప్రాణుం జేసెను.

అంత మంత్రి బండినుండి వెల్వడివచ్చి శ్రీధరుని,విజయ సింహుని గౌఁగిలించు కొనియెను. మఱల నాముగ్గురు నాబండి సై నెక్కి యామర్రి చెట్టు ప్రక్కఁగా నావలకుందోలుకొని పోయిరి. అట్లు వారాప్రక్కఁగా రెండు మైళ్ల దూరమరుగు సరి కక్కడం గొందఱు సేవకులు గుఱ్ఱములతో సిద్ధముగా వీరి కొఱ కెదురు చూచుచుండిరి. విజయసింహ, శ్రీధర, బుద్ధిసాగరులు కొంత సేపటివలకు నేదో గుసగుసలాడుకొనిరి. ఆ మువ్వురును మూఁ డు గుఱ్ఱముల నెక్కిరి. బండి నచటనే వదలి విజయసింహుఁడు కొందఱు సేవకులతోఁ గూడి యొక కొత్తమార్గమునఁ బట్ట ణాభిముఖుండై పోయెను. బుద్ధిసాగర శ్రీధరులు భటు నొకనిం డోడు గైకొని యెచటికో పోయిరి.