పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/189

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువది రెండవ ప్రకరణము

171


చునేయుండెను. వారు గాలికి దిగువున నుండిరి. అందుచే నది పై ననున్న బండివారికి వినంబడుట లేదు. కాని బుద్ధిసాగరుఁ డెట్లో వారి రాకను గ్రహించెను.'

ఇఁక గమ్యస్థానము విశేషము దూరము లేదు. మళ్లీ చెట్టునకు సమీపమున నొక చోట నిరువురు మనుష్యులు కూర్చుండియుండిరి. వారు కాఱుదున్న పోతులవలె నుండిరి. నల్లని నేరేడుపండువంటి వన్నెగల శరీరము, పొడవైన యా కృతి గల్గి యా యిరువురును భయంకరముగా నుండిరి.

'వారే య్ ! శూడరోయ్ బండొత్తావుంది ”

  • ఆఁ ! అధోరోయ్ ”

కాళమ్మోర్ని తల్చుకొని కత్తుచ్చుకోరోయ్'

' ఇవ్వాలో మన దరిద్దరం అంతా తీర్తంది ”

  • కల్లు ముంతలకీ సారాయి ముంతల! తస్సాగొయ్య

రొండు సోంవచ్చ రాయీకా పరవా లేదు.”

అనుకొనుచు, ఆయుధములను సర్దుకొనుచుండిరి. బండి సమీపించెను. ఇంతలో నాయిరువురు మనుజులలో నొకఁడు దద్దరిల్లునట్లు “ఆఁ! చచ్చారా ! బాబో" అని కేక వేసి క్రిందబడెను.

అంతలో రెండవ పురుషుఁడు వెన్కకుండిరిగి చూచేను. ఆజాను బాహువయిన యొక యున్నత విగ్రహ మతనికంటం బడెను.