పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఇరువదియొకటవ ప్రకరణము

161


. ద్వార పాలకులు వారి నడ్డగించి " ఎవరు ? మీరులోనికి బోఁగూడదు. తిరిగిపొండు ' అని గద్దించిరి.

  • నేను బోయెదను. ఎవరడ్డము వత్తురు ? ”

"మీకుఁ బోవ నధికారము లేదు ”

"మాకుఁ గలదు'

అట్టిదే దేని యున్నంజూపుఁడు ”

అతఁడొక ముద్రికను దీసి చూపిం చెను. ఆ ద్వార పాల కుల గుండియ లవిసెను. వారతని ముందు సాష్టాంగముగాఁబడి అయ్యా! మాతప్పును మన్నించుఁడు. మేము మిమ్మెఱుగక యపరాధముం జేసితిమి ' అని వేడుకొనిరి.

"క్షమించితిమి. లెండు ”

"అయ్యా: బ్రతికితిమి.”

అది నవాబు ముద్రిక . అది రాజులకును, గొప్ప ప్రభు వులకును, నవాబు బంధువులకును గూడ దుర్లభము. అతని కట్టి ముద్రిక చిక్కుటం జేసి, అతఁడెవరో యని భయపడిరి. అతఁడా ప్రాకారముదాటి లోనికింబోయెను. ఆ ప్రాకా రము లోపల నే వారింగని పెట్టి యుండుట కేర్పడిన గొప్పయధి కారి యుండెను. అతఁడు తిన్నగా, ఆ యధికారియున్న భవ నము ప్రక్కకుఁబోయి యొక సేవకుని లోనికంపెను. అతఁ డితసి రాక నెఱిగించెను.