పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పందొమ్మిద వ ప్రకరణము


--

రాధా కుమారుఁడు

కం|| స్వాతంత్ర్యమె నిజమోక్షము
స్వాతంత్ర్యమె సర్వ సౌఖ్య సారము జగతి
స్వాతంత్ర్య మభిలషించెడు
నాతఁడు దేవేంద్రపదవి నైనఁ ద్యజించున్,

సృష్టిలోని జంతువుల కెల్ల స్వాతంత్ర్యేచ్ఛ స్వాభావి కము. పరాధీన జీవితము సర్వభోగవంతమయ్యు సౌఖ్యకరము కాజాలదు. మానవులకు స్వాతంత్ర్యేచ్ఛ తదితరజంతువుల కంటే హెచ్చు. సకల సుఖాస్పదములయిన చంద్రశాలలలో హంసతూలికా తల్పములందుఁ గోరినవస్తు ప్రపంచము నెల్లనను భవించుచు భూలోకమందు స్వర్గ సౌఖ్యముల నందుటకంటెఁ గల్గినంతవఱకు దీని త్రావి స్వేచ్ఛాపరతంత్రుఁడై మెలఁగు చుండుట య నేక రెట్లుత్తమము. పరాధీన జీవితము నే యెల్లపుడు గోరుచుండు వారు త్తములుకారు. ఉత్తము లెల్లపుడు స్వతం త్రత నభిలషింతురు. దానికొఱకే రాష్ట్రములు పోరాడు చున్నవి. 'రాజ్యములు నశించుచున్న వి. కోట్లకొలందిగా జనులు నశించు చున్నారు. కాని యు త్తములు తదభిలాషను విడువరు.