పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నెనిమిదవ ప్రకరణము

145


'నాకీ కారాగార బంధ విమోచన మాజన్మమధ్యముననుండఁగలదా?"

యవనసుందరి యాపే ను హృదయపూర్వకముగాఁ బ్రేమించెను. అందు కామె సౌందర్యమును సుగుణగణములును వారుపడుచున్న 'కష్టములును గారణములు కావచ్చును. అది యునుగాక యామేస్వభావము కరుణారసపూరితము. ఆమె యిదివఱకే యీ మెకష్టములను దప్పింపన లెనని సంకల్పించి యుండెను.

“ సోదరీ ! అవును. పాపము మావలన నీకుఁగష్టములు చాల సంప్రాప్తించినవి. అయినను సోదరీతిలకమా! నీకష్టము లం దొలగించుట నాచే నైనంతవఱకుఁ బ్రయత్నించి చూచె దను ,

“సా హెబా! వందనములు. నాయందిట్టి కరుణనువహిం చుట నాయదృష్టము. నా పుణ్యము పరిపక్వమైనది. మఱచి పోవలదు సుమీ!”

" అక్కా ! ప్రొద్దుపోయినది. ఇంక నిటనుండుట య క్తముకాదు. పోదము. కాని చింత మాత్రము మనస్సునం దుంచు కొనకుము. నీకుఁ ద్వరలోనే విముక్తి యగును లే'

  • అక్కా! పరిపూర్ణ కృపనుంచుము. మీమాటలచే

నాకు స్వస్థత కల్గుచున్నది. ఇంక సెలవు తీసికొనెదను ”

మంచిది. మీ యిరువురుదంపతులను మఱియొక సారి చూచు భాగ్యము నాకుఁగల్గుంగాక !

.