పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/162

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

144

విజయనగర సామ్రాజ్యము



తరుణుల కది స్వాభావికము. భార్యా భర్తలకు నేకత్ర సమావేశము చేసి పరిహసించుట సుందరీమణులకు సంతోష ముగానుండును. అందీ యవనసుందరి హృదయము నిష్కా పట్యమైనది.

అక్కా ! ప్రత్యుత్తరమియ వేమి ? ”

ప్రత్యుత్తర మేమున్నది ! మీ రేఱుఁగరా !”

ఆ చిత్రపటమెవరిది ? అది నీకిదివఱకే గోచరించియుం డును. అదిస్వభావము. అంతమాత్రము స్ఫురింపనివాని కేదియు స్ఫురింపదు. ఆ చిత్ర ఫలకమువంకఁ దిన్నగాఁ జూడుము. అందు విజయసింహుని లోకోత్తర మూర్తి కలదు.

“ నీ హృదయమును హరించిన సుందరుఁ డితఁడేనా ? '

ఆమె చీఱునగవుచే నంగీకారభావమును సూచించెను. మఱి యిట నెను.

'కాని అక్కా ! ఈ కోరిక యి జన్మమున లభించు " నది కాదు. అంత భాగ్యము నావంటి దురదృష్టురాలికి గల్గదు.'

'ఎందుచేత ! ఇది పరస్పరాను రాగముకాదా ! అతఁడు కూడ నిన్ను ప్రేమింప లేదా? చూడుము! ఈసమానరూపవయో విలాసములే మిమ్మిరువురను దంపతులనుగా, జేయఁదలఁచి దేవుఁడు సృష్టించెనని చెప్పక చెప్పుచున్నవి. అది తప్పె నేని యాసృష్టి రుచించునా :- అతఁడు కూడ నిన్ను ప్రేమించె నని వింటి నే?”