పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నెనిమిదన ప్రకరణము

141


అది యడుఁగఁదగినదియుఁ జెప్పఁదగినదియుఁగూడ నై నపక్షమున నభ్యంతర మేమి? మాకది యవమాన ప్రదము కా దేని యడుగవచ్చును'

“ అది మనోహరమైనది. శ్రవణానందకరమైనది. ప్రేమ యీశ్వరదత్తమైన శాశ్వతవస్తువు. అది యత్యంత మధు రము. మానవుల కెచట యిష్టమో యది యచట పుట్టుచుం డును. ఇష్టమే ప్రేమ.. ప్రేమయే యిష్టము. అది యిచ్చిన వారికిఁ బుచ్చుకొన్న వారికి హర్షమును జనింపఁ జేయును. ఎవరి యందుగాని తమ ప్రేమను లగ్నము చేయక మానవు లుండఁజూ లరు. అది నారిసహజగుణము. సకలజగన్మనోహరమైన యీ సుందరీ రత్నముయొక్క ప్రేమ మెచట లగ్నమైనది ? '

ఆమె మొగము మండమారుత కంపిత స్వర్ణకమలము వలెఁ జలించెను. అవనత మై యుండెను. ప్రేమతరంగిణి యామెమొగమునుండి ప్రవహించు చుండెను. మనోహారిణియగులజ్ఞయందు స్నానము చేయుచుండెను. ఆసుందరీమణి మతి మాట లాడ లేకపోయెను.

“ అనూ నవిలాస శోభితమయిన నీ మొగ మే నీహృదయ మును జెప్పక చెప్పుచున్నది. హిందూసుందరులు తమ మనో హరుల నామములను జెప్పరని వింటిని. పోని మ్మది యెక్కడ నేని సక్తమయినదా? లేదా? "

"ఆ హేమసరోజము : ' యథాపూర్వముగా' .. నుండెను. అట్ల తన్నంత ప్రీతిపూర్వకముగా . నడిగిన : యీయవన పట్ట