పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

136

విజయనగర సామ్రాజ్యము

.

మఱల నొకసారి యాపె కనుంగొలకులు బాష్ప పరి వృతములాయెను. స్త్రీ లెంత ధైర్య వంతురాండ్రయినను హృదయములు శిరీషకుసుమ కోమలములు. పురుషులవలెఁ గష్టముల నెదుర్కొని నిలువఁజాలరు. ఆపె లోన “హా! తండ్రీ నావలన నీకెట్టి కష్టములు వచ్చినవి ?' అని యనుకొనెను. అదియంతయు బేగము కని పెట్టెను. ఆపె యామెనీ ప్రసంగము నుండి మార్పవలయునని తలఁచెను.

‘నవనీతకోమలమగు నీహృదయము నీకష్టకరమగు ప్రసంగముచే క్షోభ పెట్టను..

ఆమె ముఖము వినమ్రమైయుండెను.

“అక్కా! మనము స్నేహభావముగల సోదరీతిలకముల వలె మాటలాడుకొందమని నీతో ముందే చెప్పితిని. ఇంకను సంశయించెద వేల ! నాయీ ప్రసంగము నీ కేమేని కష్టమును గల్లింపదుగదా!”

' అమ్మా ! అట్లు తలపోయకుము. కష్టములతోఁ గుందు చున్న నన్ను గృపావి శేషముచే మన్నించి నా మేల్చెడ్డలను దల్లి వలెఁ గనుఁగొనుచున్న మీప్రసంగము నాకుఁగష్ట దాయక మేలయగుమ?"

“ అవును! అది కాదు. హిందూసుందరీమణులు స్వాభా వికముగా సాధుశీలము కలవారు. మెల్ల గా మాటలాడుటకు వారలవడియుందురు. అది నే నెఱుంగుదును. వారికి మావలె