పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/153

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునెనిమిదవ ప్రకరణము

135


. .

“అక్కా! నేను నిన్ను ' అక్కా' యని పిలిచెదను. నీవును నన్నట్లే పిలువుము. స్నేహపూర్వకమగు నీ ప్రసంగమున దారతమ్య ముండరాదు."

అది మీదయ. సజ్జనలక్షణము '

మీ మొగముజూఁడఁగా నాకు మిక్కిలి జాలియగు చున్నది. పాపము మీకుఁ గల్గినయాపద యెంతయు విషాద కరమైనది.”

జగన్మోహిని మాటలాడ లేదు.ఆ మె మొగమున బాష్ప ములు గ్రమ్మెను. ఆ పెదృష్టి ప్రసరించుట లేదు, మొగమును వంచి మెల్ల గాఁ దనచేలాంచలమునం దుడిచికొనెను.

“అక్కా ! మీ నగర నామ మేమి ? ”

'శృంగారపురము '

“ అవును. అది మా రాజ్యములోని దే "కాదా !"

'అవును"

' ఎక్కడ! కృష్ణానదీ సమీపమునఁగాదా ?

“అక్కా ! అవును. దానికి సమీపముననే యున్నది ”

'మీతండ్రి జమీందారు. ఆయన వంశము సుప్రసిద్ధ మైనది. ఆయన సుగుణములంగూర్చి యీవఱకే వినియుంటిని. పాప మాయనకుఁ జాలకష్టమువచ్చినది. ఆయన పేరేమి ? ”

" ఆయన పేరు సోమ శేఖరమూర్తి'