పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xiv


తముల కనుగుణ దన్న ను వారితో iii. ఇందలి వర్ణనలు స్వాభావికము లై, ఆయాపాత్ర: ములుగా నున్నవి. రామరాజు బహు చైర్యశాలియు, న్యాయమూర్తియునగు చక్రవర్తి. ఇతని కాత్మవిశ్వాసము హెచ్చు. కౌటిల్యము తెలియదు. స్వామి ద్రోహులగు, ఆదిల్ శాహా చక్రధరులు త్రవ్వుగోతులను బుద్ధిసాగరుఁడు చూపించినను లక్ష్యు పెట్టక, కన్ను లుమూసికొని వానిలోదుమికెను. తుదకీతఁడు తనలోపములనుగనుఁగొని మిక్కిలి పశ్చాత్తాపపడుచు తన్ను (దాను నిందించు కొను వాక్యములు పలుమారు పఠింపఁదగినవి. బుద్ధి సాగరుని నీతియు, నిరుపమాన రాజభ క్తియు నెంతయు శ్లాఘా పాత్రములు, స్వర్ణకుమారీ జగన్మోహినులు రూప రేఖాలావణ్యాతిశయములును విద్యాబుద్ధులునుగల యాకాలపు హిందూ నారీమణులు. వీరుతమభర్తలు వలదన్నను 'యుద్ధరంగమున కరుగుట వారిపాతి వ్రత్యమును శూరత్వమును జాటుచున్న ది. ఆకాలపువీరు గుణములన్నియు విజయసింహుని యందు మూ ర్తీ భవించియున్న వని చెప్పవచ్చును, ఈ గ్రంథమునందలి చరిత్రాంశములను సుబోధకము లుగ జేయుటకుఁగాను కొన్ని పటముల నందందిమిడ్చితిమి. మఱి కొన్ని రంగుపటములను బాత్రోచితముగఁ జిత్రింపఁ బ్రయ త్నించితిమి. కాని ప్రస్తుతము మన దేశమునందు సంక్షోభముఁ గలిగించుచున్న మహాయుద్ధమువలన గలిగిన యాటంకముల చేత వలనుపడినదిగాదు. అందుల కెంతయుఁ జింతిలుచున్నాము.

చిం తాద్రి పేట,
5-10-14. .

ఇట్లు

సంపాదకుడు