పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము

129


వ్యర్థ ప్రసంగము చేయునా ! ఆయు త్తరమున నీసంగతులన్నియుఁ జెప్పఁబడియుండ లేదా ! అయినచో నతఁడు మరలనూర కిటేల యతని నడుగవలయును ! అతఁ డొకసారి యా సౌధము ముందునకు వచ్చి యుమ్మి యుమియుచు నల్గడలఁ బరీక్షించి చూచెను. అతని కేమియు గోచరింపలేదు.

“ ఇపుదెంత కాలమైయుండును ? ”

“ రమారమి రెండుజాము లైనది "

"బండివాఁడు సరియైనవాఁడేనా ? ”

అతని కీ ప్రశ్నలు విసుగుఁబుట్టించు చుండెను. అతని కా మంత్రి యొక్క భావ మేమియు నర్థము కాలేదు. అతఁడు వత్తు ననియు రాననియుఁ జెప్ప లేదు. వచ్చునది రానిది యతనికిఁ దెల్లము కాలేదు. హృదయ మూగుంచుడెను. ఏమన్న నేమ గునోయని భయము. పయికి మాత్రము గాంభీర్యము. మంత్రి యతని నప్పుడప్పుడు వీక్షించుచుండెను. అది యతనికి మఱింత భీతిదాయకముగా నుండెను. ఎట్టకేల కతఁడిట్లనియెను.

“అయ్యా ! కాలము పోవుచున్నది. ఆలస్య మేల ? ”

“ అవును. మనకిపుడు కర్తవ్య మేమి ? ”

• ఏమియు లేదు. పోవుటయే. ”

అతఁడు మరల నొకపరి సౌధపురః ప్రదేశమునకు వచ్చెను. దూరమున .నతని కేదో గుర్తు కాన్పించెను. “ఆఁ ! ఇఁక పోవ చ్చును ' అని తనలో ననుకొనెను.