పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవ ప్రకరణము

127


చర్చించి, పిమ్మట,ఇష్టమగు కార్యమును జేయుటయే మంచిది. ఏలయన ! అది రహస్య వ్యాపారములకు మిక్కిలి యోగ్య మయినస్థలము. అఁట నిర్భయముగా నెంత సేపయినను, ఏవిష యమునుగూర్చియైనను జెప్పుకొనవచ్చును.

విజయనగర ప్రాంతములు జనాకీర్ణములు. అచ్చట "రాత్రింబవళ్ళు నెల్ల వేళలను మానవులు సంచరించుచు చుందు రు. రహస్య వ్యాపారముల కాప్రాంత భూములు యోగ్యములు కావు. రాత్రిపూట పట్టణము వెలుపలకుఁబోవుటకు ద్వార పాలకులకుఁ గనపఱచవలసిన చీటిని సంపాదించి కుమార సింహునకిచ్చితిని. మనకిఁక నేభయమును లేదు. కనుక మీరు సంశయింపక త్వరగా మీకొఱకంపిన బండి నెక్కి పై జెప్పిన ప్రదేశమునకు దయ చేయుఁడు. అచట నేను మీకొఱ కెదురు చూచుచుఁ దగినంత పరివారముతో సిద్ధముగా నుందును. మీరు పరదేశమునకుఁ బోవలయునన్న వలయు సామగ్రిని గుఱ్ఱములను దీసికొని పోవుచున్నాను.

ఇపుడు మనకెంతయు ననుకూలమగు సమయము.

చిత్తగింపుఁడు. ఇట్లు భవత్పాదార వింద సేవకుఁడు విజయసింహుఁడు”