పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

విజయనగర సామ్రాజ్యము


అయినను, ఇట్టికష్టస్థితిలోఁ దమకు నాకు సాధ్యమైనంత మేలుకలుగఁ జేసి, తమయెడ నాకుఁగలభ క్తిని జూపుకొనఁదలఁ చితిని. నేను కారాగారమునుండి మిమ్మెట్లయినను దప్పించుటకు బూనితిని, దేవునికృపవలన నిందు మనకు సంపూర్ణ విజయము సిద్దించునుగాక !

కారాగారాధిపతిని మనకులోఁబడునట్లు చేసితిని. దా నోపాయమున ద్వారపాలకులను గూడ మనపక్షమునకుఁ ద్రిప్పి తిని. మన మీరాత్రి పోవునప్పు డడ్డమునచ్చువా రెవరును లేరు. ఈ యుత్తరముం దెచ్చిన వాఁడు నాకు మిక్కిలి స్నేహి తుఁడు. బంధువు. ఇతఁడు మీయందు భక్తికల్గి మెలఁగునట్టి వాఁడు. ఇతని పేరు కుమారసింహుడు. ఇతనికొక బండినిచ్చితిని. బండివాఁడుకూడ మిక్కిలి నమ్మక మయినవాఁడు. నేను మీరాక కెదురుచూచుచు, తుంగభద్రా స్రవంతి దఱినున్న యిసుక గుట్టల దగ్గఱగానుండు విశాలమగు వట వృక్షముకడ నుందును. అది మన కెంతయుఁ దగిన ప్రదేశమని మీరెఱుఁగుదురు. అచటినుండి మీరు పర దేశమునకుఁ బో వచ్చును. ఇచట నుండుట మనకు క్షేమంకరము కాదనుట మీరెఱుఁగని విషయము కాదు. శత్రుసమూహముల మధ్య నుండుట కంటె నపాయకరమేమియుండును. ఒక వేళ మీరు పర దేశగమన మంత మంచిది కాదనియు, ఇచటనే మాఱు వేసమున నుంట మంచిదనియుఁ దలఁచినను, అచటికి వచ్చి