పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునేడవప్రకరణము

125


“ వారి కతఁడేదో సమాధానము చెప్పినాఁడు '

' ఇప్పుడు నన్నెక్కడికిఁ గొంపోవుదువు ? ”

“ చెఱనుండి విముక్తులను జేయుటకు. తరువాత మీ యిష్టము

“ నిన్ను నేనెఱుఁగను.

ఆ నూత్న పురుషుఁ డీ ప్రశ్నలకు మిక్కిలి లోనఁ గంపింపఁ దొడఁగెను. అతనికి బుద్ధిసాగరుఁడు తమతంత్రమునం బడు నన్నయాశ తగ్గెను. ' ఈ యుత్తర మున్నదికాదా ? ఈ దివ్యా యుధమునకుఁగూఁడ నితడు జంకకుండునా ! " అనుకొనెను.

• నీ దగ్గలు 'నే మేని యతఁడే నిన్నం పెననుటకుఁ దగిన యాధారముకలదా?'

• ఇదిగో, ఈయుత్తరమును జూచుకొనుఁడు. తమ సంశయమె దీరును"

అతఁడాయు త్తరమును దీసి బుద్ధిసాగరుని హస్తమున నుంచెను. అతఁడది స్వీకరించి మెల్లగా నిట్లు, చదివెను.

" శ్రీమహా మంత్రులవారి సన్నిధికి :- తమ కృపాపాత్రుఁడు విజయసింహుఁ డనేక సమ స్కారములు:-

అయ్యా ! మీరు ప్రతిపక్షుల యొక్క కుట్రలవలన, "నేద్రోహముఁ జేయకున్నను, రాజద్రోహులై వృధాగా శిక్షనందుచున్నారు. ఇందుకు నేఁజాల చింతిల్లుచున్నాను. -