పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సంఫాదకీయ భూమిక


ఇది 1913 -వసంవత్సరపుబహుమతి పరీక్షలో రు. 500 ల బహుమతిగన్న 'నవల.దీని నిదివరలోఁ గొంత కాలము క్రిందటనే ప్రచురింపఁదలఁచితిమి కాని గ్రంథకర్తగారు పీఠికలో సూచించిన కొన్ని కారణములచే నింతనజుకుఁ జందా దారుల కందఁ జేయఁజాలమైతిమి.

ఆ సంవత్సరపు బహుమతి పరీక్ష, కంపఁబడిన పది గ్రం థములలో నీ గ్రంథముయొక్క యాధిక్యతను దీనిని బటంచిన చదువరు లెఱుఁగఁగలరు. తాము నిర్మించిన చిత్తరువులకుఁ దక్కినవారు చక్కఁగాఁ బ్రాణమును బోయ లేకుండుటయు నీ గ్రంథకర్త తన కల్పనాచాతుర్యముచేఁ దానిని సజీవముగాఁ జేయుటయు నందలి రహస్యము. ఐనను బరీక్షకు ఆ గ్రంథము సందు సుగుణములనియెంచిన కొన్ని యంశములను సంక్షేప ముగా నిందుదాహరించెదము.


i.విజయనగర సామ్రాజ్య నాశనము కథా సారమైనను గ్రంధకర్త చేతులలో నీ సామ్రాజ్య ము యొక్క వైభవము మిక్కిలి చక్కగను, ఉర్కృష్టముగను బ్రకాశించు చున్నది. ఇందలి కల్ప నాచాత్యుము పటుత్వమును, గాంభీర్య మును గలిగి చదువరుల కానందమును, పగవశతను తుదవరకు గలిగింపగలదు. మహమ్మదీయ చక్రవర్తులు బహిర౦గముగ యుద్ధమును గాక జిత్తులచే నీసామ్రాజ్యమును నశింపఁ జేయఁ బ్రయత్నించుటయే హిందూ సామ్రాజ్యము " మొక్క ప్రతి భావిశేషమును "వేయిరెట్లు హెచ్చించుచున్న ది.

ii. గ్రంధకర్తయొక్క వచనరచన మృదుమనుగ మై, ప్రౌడమై, స్వాభావిక మైన ప్రవాహము గలదై, కొండలంతటి లోపము లనుగూడ "నుక్కొకతరి నలుసులవలెఁ జేయు చున్నది.