పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/139

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నేడ వ ప్రకరణము

దీర్ఘదర్శి

రాత్రి ప్రొద్దుపోయెను. కారాగారాధిపతి యింటిలో నుండెను. అందు గొందఱు గసగుస లాడుచుండిరి. అయింటి యరగు పైన వెనుక ప్రక్క మన యోగి పరుండి యుండెను. అది దిడ్డివాకిలి. ఆవాకిట నెవరికిని విశ్లేషించి పనియుండదు. ఆ దారి నాయింటికిఁబోవు వా రరిది. ముందు ద్వారమున నే యెల్ల వారును బోవుచుందురు. ఆయింటఁ గొందఱు గొప్ప వారుండిరి. వారున్నది సభామంటపము. అందుఁ బెద్దమను ష్యులు వచ్చి కూర్చుందురు. అది మనోహరముగా నుండెను.

అందు, ధనరాసులు కుప్పలుగా మోగుచుండెను. అంతధనము నతఁడెప్పుడు చూచియుండఁడు. కాని యతనికి గుండెలు కొట్టుకొనుచుండెను. అతని కేమియుఁ దోఁచినది కాదు. అతని కా యోగితో సంభాషింపవలయునని కోర్కె పుట్టెను. అతఁడాప్రదేశమునకుఁ బోయి అతనిని మెల్లగాఁ దట్టెను. అతఁడు మేల్కొనెను.

'అయ్యా ! ఇపుడు నే నొకయంశము మీతో మాట లాడవలసి యున్నది.”