పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునారవ ప్రకరణము

119


యతనిముం జేతియందు మెఱుయుచున్న బంగారుకడియమును దీసి యొసఁగఁబోయెను.

మాకట్టివి యవసఱము లేదు. కాంచనము మా కేల ? సంసారమా! భార్యలా ? బిడ్డలా ! మాకు వేళకుబట్టెడన్నము దొరకిన నంతియే చాలును, మీవంటివారి సంతోషమే మాకుఁ దగిన ప్రతిఫలము. అదిచాలును.”

అది చూఁచుచు, నచ్చటివారిలోఁ గొందఱు “స్వామీ! మాకుఁగూడఁ జెప్పుడు' అని ప్రార్థించిరి.

వారి వారికిఁ దగినరీతులను వారి కెల్లరకు సరిగా నాతఁడు చెప్పెను. వారిలో గొందఱకు రక్ష రేకులు కటైను. వారెల్లరుఁ బరితృప్తులై రి. బుద్ధిసాగరుఁడు సమీపించెను.

" నీకుఁగూడ జ్యోతిషము కావలయునా యేమి?”

“ అవును”

“ నీవు, వీరివంటి వాఁడవుగావు'

“ఎందుచేత? "

  • నీవు రాజద్రోహివి'

మహాత్ములకు నన్నియుఁ దెలియును. మీకుఁదోఁచి నది చెప్పుడు ' ,

అచట నున్న వారి కెల్లరకు బుద్ధిసాగరునందుఁగల ప్రేమ మిక్కిలి విస్తారము. అతఁడు మంత్రిగానుండి వారి కెల్లరకు జాల మేలుచే సెను. విధివశమునఁ జెఱసాలలోఁబడి యిపుడు "