పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము

113


ఇట్లనుచుండఁగనే యొక తురుష్క యౌవనుఁ డతని పై కి దుమికెను. అది చూచి రాయ బారితో వచ్చిన మఱియిద్దఱు బాకులు తీసికొని విజృంభించిరి.మన రాయ బారియు విజృంభించి ఆంధ్ర వీరులు బొందిలోఁ బ్రాణమున్నంతనజకు రాజభక్తిని విడువరు. ప్రాణములను లెక్క సేయరు. రండు! సంతోష ముతోఁ బ్రాణముల నిట విడిచెదను' అనెను. ఆ యిరువురుఁ గూడ కాలానల జ్వాలలను మారుచున్న రౌద్రరూపములతో సిద్ధముగా నుండిరి.

ఇఁక నవాబు బుసగొట్టుచున్న కాలసర్పమువలె నుండెను. మంత్రి " రాయబారులం జంపిన నేమి లా భ ము !కయ్యము మానుఁడు ' అనెను. అందుఁ గొందఱు మహారాష్ట్ర వీరులుండిరి. 'నా రతి ప్రయత్నమున దురకల నాపిరి. ' బ్రతికిపోతిరి. పోయి యుద్ధ ప్రయత్నములు చేసికొమ్మని మీ రాజుతోఁ జెప్పుడు ' అని సవాబు రౌద్రముతో " జెప్పెను.