పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

112

విజయనగర సామ్రాజ్యము


దుర్మార్గునకు మేలుచేయుట కాలసర్పమునకుఁ బాలు పోసి పెంచుటవంటిది. ఈ కుతుబ్షాహాను రామరాజు పూర్వము రక్షించెను. కుతుబ్ షాహాతండ్రి గతించినప్పు డతనియన్న తండ్రి స్థానము నలంకరించెను. అతఁ డితనింజంపఁ బ్రయ త్నింప నితఁడు రామరాజు శరణుజొచ్చెను. అతఁ డితనిని విజ యనగరమున నిర్భయముగాఁ గాపాడెను. తరువాత యన్న చనిపోగా నితం డతనికుమారునింజంపి తద్రాజ్యభారమును వహించెను. అట్టి యీపురుషునకు రామరాజు ఉప దేశ వాక్య ములు విషతుల్యములుగాఁ బరిణమించెను. నవాబట్ల నఁగనే సేనానాయకులును, తోకతొక్కిన త్రాచులకరణి లేచి రామరాజునకుఁ బొగరెక్కెనని యొక్క డును, అతనిని నాశము చేయవ లెనని యొక్కఁడును నోరికి వచ్చి నథ్లెల్లఁ గూయఁజొచ్చిరి.

అంత రామరాజు రాయ బారి యిట్లనెను. “రాజా ! ముసల్మాను యోధులారా !

మీ కూరక రామరాజును నిందించినఁ బ్రయోజనము లేదు. చాటున నూరక మొఱుగుట సజ్జనఁ లక్షణము కాదు. మీకు శక్తియున్నచో యుద్ధము నందాయన సైన్యములం దా ర్కొని జయించి మగఁటిమి చూపుట లెస్సగాని, యిట్లు చేత గాని ప్రేలుఁడు ప్రేలిన లాభ మేమి ? ఇట్టిపనిని మూలనుండు ముసలమ్మలు మీకంటె నెక్కుడుగాఁ జేయఁగలరు.-- ”