పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xii ఇందలి కథను మ-రా-శ్రీ కే. వి. లక్ముణరావు పంతు లుగారి మహమ్మదీయ మహాయుగమునుండి స్వీకరించితిని. కావున శ్రీపంతులుగారి సాయము నొకపరి యిచ్చట సంస్మరిం చుట నాకుంగర్తవ్యము. ఈ గ్రంథమును శీఘ్రముగను, శుద్ధము గను, అచ్చు వేయించిన హెచ్. వి. కృష్ణ అండు కో వారికిని అండందు మార్పులఁ జేసి వన్నె బెట్టిన శ్రీయుత ఆచంట లక్ష్మీపతి బి. ఏ., ఎం. బి., సి. ఎం., గారికిని నాకృతజ్ఞ తావందనములు. మండలివారీ గ్రంథమును చిరకాలము క్రిందనే ప్రక టింప నిశ్చయించిరి. అయినను నాకుఁదగిన సానకాశము గల్గమిం జేసియు శరీరస్వాస్థ్యములేమి మొదలగు మఱికొన్ని యని వార్యములగు ఆటంకముల వలనను మండలివారికిని ఆంధ పాఠక ప్రపంచమునకును ఆశాభంగము కల్గించితిని. నేఁ జేసిన యాలస్యమున కెల్ల నోర్చినమండలివారి యౌదార్యము, శాం తము ప్రశంసనీయములు. పాఠకమహాశయులీ యాలస్యమును మన్నింతురుగాక. గుణదోషని యమునకుఁ ప్రాజ్ఞలోకము శరణ్యము.

ఆపరితోషా ద్విదుపాం నసాధుమ న్యే ప్రయోగ విజ్ఞానం బలవదని శిక్షి, తానా మాత్మన్య ప్రత్యయంచేత. (కాళికాను)


బాలసరస్వతీ పుస్తక భాండాగారముఅంగలూరు


19.9.14.

ఇట్లు విధేయుఁడు దుగ్గిరాల. రాఘవ చంద్రయ్య చౌదరి.