పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునైదవ ప్రకరణము

111


  • ఇటువచ్చి కూర్చుండుఁడు. '.. అనియెను.

చిత్తము ' అని యతఁడొక కుర్చీపై నధిష్ఠించెను.

  • మీరు తెచ్చిన రాయ బార మేమి? "అని మంత్రి యడిగెను.

ఇది చూచుకొనుఁడు. తక్కినది మీ కేయర్థమగును.” అని యతఁ డాయుత్తరము నొసంగెను. అది గైకొని మంత్రి మొదలునుండి తుదవఱకు సొంతముగాఁ జదివెను. అచ్చట నున్న యోధుల మొగములు రక్తవర్ణాలం కృతముల య్యెను. సవాబు కన్ను లేఱ్ఱఁబడెను.

సేనాధిపతులారా ! యౌవన తురుష్కులారా ! చూచితిరా కాల మెట్లు విపరీతముగాఁ బరిణమించి నదో ? నా కితఁడు బుద్ధిగఱపుచున్నాడు. పైగా నితనితో స్నేహమును నేను నిల్పుకోవలయునట ! ఇతని స్నేహమును నిలుపుకొనకయున్నచో మన కిఁక దిక్కు లేదుగాఁబోలు! మన మితని మోచేతి క్రింద నీళ్లు త్రాగుచున్నామని తలఁచెను. ఔరా ! కాఫరులపని క్రిందును మీదును దెలియకున్నది. ఇందుకు వారి ననవలసిన పని లేదు. మసయొక్క కృపయే ఇంతవఱకుఁ దెచ్చినది. పూర్వము మన ముసల్మానులు చేసి సట్లు మనముకూడఁ జేసినచో మనల నిట్లు వీరధిక్షేపింపఁ గలరా ? ఆహా! కాల మాహాత్మ్యము ! రామరాజు నాకు నీతు లుపదేశింపవలసి వచ్చెనుగా ! కనులు పొరలు గ్రమ్మినవి కాబోలు ! " అని యతఁడు కూర్చుండెను.