పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/128

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

110

విజయనగర సామ్రాజము


షరాయిలను ధరించిరి. వారిటోపీలపై దురాయి లతిమనో హరముగాఁ బ్రకాశించుచుండెను. మొగమల్ కోట్లపైనఁ జేయఁబడిన బంగారుబు టేదారు పనులు చూచువారి కనులకు మిఱుమిట్లు గొలుపుచుండెను. అట్టియెడ నొక సేవకుఁ డచటి కరు దెంచి యిట్లనియె.

"దేవా! విజయనగరమునుండి రాయ బారి వచ్చినాఁడు. దేవర దర్శనమును గోరుచున్నాఁడు.”

అతఁ డౌదూతలనుగూర్చి చారుల మూలముగా నిది వఱకే వినియుండెను.

“ మా కా రాయ బారులతోను; గీయ బారులతోను బని లేదు ? ' అని ప్రభువు చెప్పెను.

“ అవునండి. అంతే' అని యొకఁ డనియెను.

మంత్రి నవాబువంకఁ జూచి " అయినను, అది వినుట మనకుఁ గర్తవ్యము ” అనెను. మఱికొందఱు, మంత్రిమాటను బలపఱచిరి.

అయినచో రానిమ్ము' అని ప్రభువు మరల ననెను.

సేవకుఁడు . చిత్తము ' అని వెడలిపోయెను.

అంత నా రాయ బారి నవాబునకు సలాము చేసి లోనఁ బ్రవేశించెను. నవాబు . మాటలాడ లేదు. మఱి యెవరును మాటలాడ లేదు. అతనికన్ను లెఱబడుచుండెను. అది మంత్రి చూచెనో లేదో కాని, ' .