పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/127

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నైదవ ప్రకరణము

తిరస్కారము

గోల్కొండ దర్బారున కొకసారి పోవుదము.అది నానావిధ నూతనాలంకార శోభితమై యుండెను.

అందుఁ దమతమ పదవులకుఁ దగిన తావులయందు, మంత్రులు, యోధులు మొదలగు వారెల్లరును గూర్చుండి యుండిరి. కొందఱు ద్రాక్షారసమును ద్రావి హాయిగా, ఆ వినోదములను జూచుచు గూర్చుండిరి. నవాబు సింహాసనా సీనుఁ డై యుండెను. అనర్హ మణి జాలములచే నాసభామంటప కుడ్యములు ప్రకాశించుచుండెను. అందు నగిషీ పనులు మనో హరముగాఁ జక్కఁబడెను. ఆ గోడలపైన లతలు, వృక్షములు, హంసములు, మయూరములు సువర్ణపుఁబనులతోఁజత్రింపఁబడి యుండెను. మహమ్మదీయులు నానావిధాలంకార ప్రియులు. వారికి భూలోక వినోదములందుఁ బ్రీతి విస్తారము.

అందలి వారెల్ల నానావిధ చిత్రవిచిత్ర వస్త్రాలంకార శోభితులయి యుండిరి. కొండఱు తెల్ల పట్టుతోను, కొందఱు . నల్ల పట్టుతోను, కొంద ఱైర్రపట్టుతోను జేసిన పాగాలను టోపీ లను ధరించియుండిరి. అందఱును వివిధ వర్ణ శోభితములయిన