పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాలుగవ ప్రకరణము

107


" అయ్యా ! మూకును , మాకును మైత్రి చాల కాలమునుండి వచ్చు చున్నది. అట్టిమైత్రినే మన కెల్ల ప్పుడును దైనము ప్రసాదించు నుగాత!

మా కొలువునందు విజయసింహుఁడను సుప్రసిద్ధుఁడగు పడుచువాఁడు కలఁడని మీ రెఱిఁగియే యుందురు. అతఁడు మా సై న్యాధి కారులలో నొకఁడు. ఉన్నతవంశీకుఁడు. సుగుణ వంతుఁడు. అతని వంశమెల్ల బౌరుష ప్రధానము. అతనిని మీదే శములో నున్న గౌరవనీయుఁడగు శృంగారపురపు జమీం దారు, శ్రీసోమ శేఖరమూర్తిగారి కూతురు జగన్మోహిని వరించి నది. కాని పాపము మీరు రేపులగ్నమనఁగా వచ్చి జగన్మో హినిని జననీజనక సమేతముగా బంధించి గోలుకొండకుఁ దీసి కొని పోయినారఁట. అట్టి యుత్త మసాధ్వీరత్నముల మాన భంగముచేయుట మనబోంట్ల కుచితము కాదు. స్త్రీ జన మాన రకుణము రాజధర్మము. కనుక మీరు వారిని విడచి పెట్టి మనమైత్రిని నిలుపు కొందురని తలఁచుచున్నాను. వృధాగా, ఈకొద్దిపాటి విషయ మునకు గలహించుకొనుట మనకు శ్రేయో దాయకము గాదు. అన్యుని వరించిన స్త్రీని బలవంతముగాఁ దీసికొని వెళ్లి పెండ్లియాడుమని కోరుట మీకు మంచిది కాదు. మీరు వారిని వదలుదురని నమ్ముచున్నాను.”