పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/123

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునాలుగవ ప్రకరణము

105



మాని. అట్టివానికిఁ గల్గిన యీపరాభవమునకుఁ జింత నందవలసి యున్నది.

ఇందీ తరుణవయస్కుని తప్పేమియు లేదు. పాప మత నింట పెండ్లియగునని యతని బందుగులును, స్నేహితులును మన మును మిక్కిలి సంతోషించుచుంటిమి. ఆ యోధున కాయా వవనతి, సర్వవిధముల యందును దగియుండునని యను కొంటిమి.

ఇట్టు లక్రమముగా వచ్చి యీ పెండ్లిని స్వప్రయోజన పరత్వబుద్ధిచే నాపుట మాత్రమేగాక తనను ప్రేమింపని జగన్మో హినిని గామించి కొనిపోయి బంధించుట శ్రీ గోల్కొండ నవాబుగారి వంటివారికిఁ దగినపనిగాదు.


ప్రమాద మెట్టివారికి నేని యుండును. అతఁ డిట్టిపనికిఁ బశ్చాత్తాపమంది,మనము రాయ బారమంపిన తత్తణమే ఆపెను తలిదండ్రులతో గూడ మన కప్పగింపక పోఁడు. అతఁడు మనకు మిత్రుఁడు. అయినను, మనకు విశ్వాసపాఁత్రుడగు విజయసిం హునకిట్టి కష్టము ప్రాప్తించి నప్పుడు మనమూరకుండుట తగిన పనికాదు. మఱియు సోమ శేఖరమూర్తి సత్కుల సంభూ తుఁడు. గౌరవనీయుఁడు. ఆతని కీ కష్టము దుస్సహము. ఇంతియ గాక హిందూ వనితలు పాతివ్రత్యమును స్త్రీలకు భూషణముగా గణింతురు. అది లేనివారిని మిక్కిలి దూషింతురు. ధనములను