పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

100

విజయనగర సామ్రాజ్యము


.

యెంతయు సమంజసముగా నున్నది. ఈ విషయమున మనకు శంకింపఁ దగిన దేదియు లేదు.

తారా:- అన్నియు బాగున్నవి. మీ ప్రయాణ మెప్పుడు ?

ఆదిల్ :- నేను రేపే ప్రయాణమై పోయెదను. సరే, చక్రధర్తులు గారూ! ఈపని యేమి చేసినారు ? సైన్యాధికముల లెక్క లన్నియు సిద్ధము చేసినారా ?

చక్ర:- ఆ పనిమీఁద నే యున్నాను.రాత్రింబవళ్ళు నెడ తెగక పనిచేసినను నేటివఱకుఁ దరిగినవి కావు, ఏనుంగులయు గుఱ్ఱములయు రధికులయు స్థిర సైన్యము యొక్కయు లెక్కలు స్థిరపడొచఁబడినవి. కాని కాల్బల మింకను జేర్చు కొనఁ బడుచుండుటచేఁ దేలినది కాదు.

ఆదిల్ :-సరే! సాపము మిక్కిలి శ్రమపడుచున్నారు. కాని మనము నేటివఱకుఁ జేసిన దెల్ల నొకప్రయత్నము కాదు. ముందు యుద్ధములో మనశక్తి సామర్థ్యములు చూపవల యును. అందు విజయము గల్గినప్పుడు మనకార్యము కొన సాగినట్లును, మనయత్నములు సిద్ధించి నట్లును తలపోయ వచ్చును. అంత వఱకు మన మేమియు నిశ్చయింప వలను పడదు. ఒక్క గడియ చాలు మనయత్న మేల్ల వ్యర్థమగు టకు! గాలితోఁ ద్రాడు పేనుటకుఁ జాలిన బుద్ధి సాగరుని మన మీ చిక్కునం బెట్టి ధ్వంసము చేయగల్గితిమా కొంతవఱకు నెగ్గినట్లే. అయినను విజయసింహ, తిరుమల