పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

98

విజయనగర సామ్రాజ్యము


బఠించి యున్నాఁడు. అతఁడు మన తంత్రములలోఁ జిక్కు కొనుటే దుస్తరము. చిక్కినచోఁ గష్టమే లేదు.

చక్ర: అవును. నా కొకయు పాయము తోచుచున్నది. విజయ సింహుని కతని యందును, అతనికి విజయసింహు సందును, ప్రేమ మిక్కుటము గదా! అతని చేవ్రాలుతో నొక యుత్త రమును సృష్టింతము.

తారా: ఆపని మీరు నిపుణముగాఁ జేయఁగలరా ? చేయఁ గల్గినచో మనపని నెగ్గును.

ఆదిల్ : ఆఁ! అందుకు సందేహ మేమి ? అట్టి యుత్తరముచే మనము నిశ్చయముగా నెగ్గగలము. అవును, మొన్న బుద్ధి సొగరుని సంతకము సృష్టించిన వారు దీనిని సృష్టింప లేరా !

చక్ర:-నేను దీనిని సృష్టించెదను కాని యతనిని జెఱనుండి తప్పించుటకును, చెఱసాలలో రాత్రిపూట మనకుఁ బ్రవే శము కల్గుటకును గారాగారాధిపతి యుత్తరువు కావల యునుగదా?

ఆదిల్ : అది యెంత సేపు ! ఒక్క చిటికెలో, ఆ పనిని నేఁ జేయఁ గలను. నాల్గు సంచులు ధనము గుప్పినసరి, కొండమీఁది కోతి దిగివచ్చును.

చక్ర:- అయినచో రేపుమాపటికే యీపని జేయుట యుక్తము.

ఇంతలో నాపనిని నేను జేసి 'సిద్ధముగా నుందును.

ఆదిల్ :- మఱి వథ్యస్థానమెక్కడ ?