పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదమూఁడవ ప్రకరణము -

95


కారాగారమున నున్నాఁడా! తప్పించుకొనకుండు నుపా యముం జూడుఁడు. అతఁడు తప్పించుకొన్నచో నిఁక మన యత్నములన్నియు బూడిద పాలు కొనలసినవే. అందుకు సందియ ము లేదు. అతని మేధాశక్తి యద్భుతమనియు, అతఁడత్యంత స్వదేశాభిమాని యనియు వినియున్నాను. అట్టివాఁడు తప్పించు కొన్నచో ఎన్ని కష్టముల నేని పొంది యతఁడు సామ్రాజ్యరక్షణ చేసితీరును. ఈభారమంతయు మీపైబెట్టితిమి. మాప్రాణ ములు మీ చేతిలోఁ బెట్టితిమి. రక్షించినను నాశము చేసినను మీరే. కార్యము లన్నిటియందుఁ గేవలము, ఆదిల్శాహాను మాత్రము నమ్మియుండకుఁడు. కార్యనిర్వవాణ దశులరగు మీరిది యెఱుఁగరని కాదు. కాని యాతురతచే నిటు' 'ఫున రుక్తి చేయుచున్నాను. అతఁడు మిక్కిలి జత్తులమాఱి.దీర్గదర్శి. పైకి నమ్మినట్లు నటించుచు లోన మిమ్ముల సతఁడు నమ్మఁడు. ప్రతి కార్యము సందును మీ దీర్గదుృష్టి ని వినియోగించి పిమ్మట సతనిసలహాను దీసికొనఁ గోరెదను. ఇఁక చక్రధరుఁడు- ఇతఁడును, అత్యద్భుత సామర్థ్యముకలవాఁడే. ఇతని యెత్తులు మిక్కిలి దుర్భేద్యములైనవి. అతనింగూడ బాగా సమ్మి యుండుట మనకు శ్రేయోదాయకము కాదు.

రాజున కనుమానము పుట్టుక యుండునట్టులే యేకార్య ములందే యేవిధముగా సంచరింప వలయునో మీకు "నేను జెప్పఁబూనుట హాస్యాస్పదము. ”