పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/107

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పండ్రెండవ ప్రకరణము

89


కాల చంచల ననుకరించెను. అధోముఖ యాయెను. నాసికా ఫుటములనుండి నిట్టూర్పు వెడ లెను.

ఆ యుచ్ఛ్వాసము వేఁడిగానుండెను. ఆపె తనువు తీవ్ర . క్రోధవశమునం గంపించెను. ఆపె యాకత్తెర బోనులోనుండి యేమిచేయును ? ఏమిచేయఁగలదు ! ఆపెఁకోపమును శాంతింపఁ జేసికొనెను. శాంతముతో నిట్లనెను.

“జనకా ! నీ వీ గోల్కొండ రాజ్యమునకు రాజువు. నీ బిడ్డలము మేము. న్యాయరక్షణమునకు దేవునిచేఁ బంపఁబడిన వారే భూలోకమునందు రాజు లగుదురు. రాజులు నిజము గా దేవాంశ సంభూతులు. అట్టి రాజులే యిట్టి యకార్య ములకు దిగినచో, ఇఁకఁ బ్రపంచ మేమికావలసి యుండును ? తల్లి యే చంపఁదలఁచిన బిడ్డలు సౌఖ్యముగా జీవింపఁగలరా ? చిర కాలమునుండి మాతండ్రులును దాతలును రాజ్యమునందు సర్వసౌఖ్యముల ననుభవించుచు జీవించిరి. కీర్తిగాంచిరి. ఇపు డిట్లు మమ్మ కారణముగా నేల బాధించెదరు. అన్యాయమున కేల పూనెదరు? అధర్మముఁ జేయుట మీవంటి రాజులకు క్షేమకరమగునా ?”

సవాబు ఫక్కున నవ్వెను.

  • సుందరీ ! ఈ నీతులు నుపన్యాసములు మేమును,ఎఱుఁ

గుదుము. "కాని యవి నిస్సారములయి నను, అమృతమును వర్షం చుచున్న నీకంఠమునంబడి సారవంతములై శ్రవణానంద కర ము లగుచున్నవి. నా కావాక్యములతోఁ బ్రయోజన మేమి ? ” .