పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పం డ్రెండ వ ప్రకరణ ము


ఇయ మధిక మనోజ్ఞ వల్క లేనాపి తన్వీ'
కిమినహి మధురాణాం మండనం నాకృతీనాం.

కాళిదాను

.

గగన కుసుమము

అతఁడిట్లు పట్టమహిషితోఁ బోరాడి వేగముగా నడిచి పోయిపోయి యొక విశాల భవనమును సమీపించెను. ఆ చంద్ర శాల సౌభాగ్యమును గాని, యందలి యతిసుందర చిత్ర ప్రతి మల నీరుగాని, యా నిర్మాణ సౌభాగ్యము గాని విశదములై ఆకసము నంటుచున్న యా మందిర శిఖరముల మనోహరత గాని చూచుచు మనము కాలయాపనము చేయ రాదు. అందొక సౌభాగ్య శాలిని కలదు. ఆమె మొగము స్రుక్కిపోయి యున్నది. అయినను సంపూర్ణ శరత్సుధాకర మండలము కంటె నందముగా నే యున్నది. తళతళ మెఱయు పట్టు చీరలతో 'నలంకరింపఁదగిన యాతనువల్లి జీర్ణ వస్త్రము లతో నలంకరింపఁబడియుండెను. ఆపె కేశపాశము పరిష్కృ తమై యుండ లేదు. అయినను,