పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదు నొకొండవ ప్రకరణ ము

ప ట్ట మ హి షి

ఆంధ్రులలోఁ గోల్కొండ పేరు నెఱుఁగనివారు చాల యరుదుగా నుందురు. అది యొక దుర్గము. అది ప్రస్తుతము హైదరాబాదునకు అయిదారు మైళ్ళ దూరమున నున్నధి. గోల్కొండ నవాబులను గూర్చి యాంధ్రులు వినియుందురు. ప్రస్తుతపు నవాబు పేరు కుతుబ్ షాహా.గోల్కొండ నవాబుల శుద్ధాంతము లత్యంత మనోహరములు, సర్వసుభగవస్తు ని కేతనములు. భూతల స్వర్గములు. సర్వసౌభాగ్యసారములు !

శుద్ధాంత మందిరములకుఁ జుట్టును బెద్ద ప్రాకారములు గలవు. ప్రాకార ద్వారముల కడ సేవకులు "కావలియుందురు. వారు పుల్లింగ స్త్రీ లింగములలోఁ జేరరు. అందుఁ బ్రవేశించు వారుత్తరువు నందవలెను. ఆ పోవువారికిఁదొంబదితొమ్మిది తని ఖీలు. స్త్రీల కేగాని పురుషులకా ప్రవేశము లేనే లేదు. కాని పాఠకులారా ! భయపడకుఁడు. మనము పోవుట కే యభ్యం తరమును లేదు. రండు. మనకీశ్వరుఁడట్టి వరమును ప్రసాదించి యున్నాడు.