పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

విజయనగర సామ్రాజ్యము



మాధుర్యములగు నా పలుకులయందు కాఠిన్యము ప్రకాశింప జొచ్చెను. ఆమెపండ్లు పటపట మనుచుండెను. తురుష్కుఁ డిట్లనెను. ఇదిగో ! అటుచూచితివా ! ఆ తురుష్క బలములం గనుగొనుము'

ఆపే దృష్టి నావంక సారించెను. ఆపె గుండెలు ఝల్లు మనెను. క్రోధము హెచ్చెను. పగ తీర్చుకొనుటకు సాధన మామె కేమియుఁ దోఁచినది కాదు. అతఁడిట్లనియెను:- మీద్వార పాలకులు, ప్రాకార పాలకులు నందఱు నిది వఱకే గతించినారు. ”

జగ:-మిరెవరు ? అక్రమముగా నిట్లేల వచ్చితిరి !

భటుఁడు:-మే మొక తురుష్క నాధుని సేవకులము.

జగ:-మీకు మేమేమి యపకృతి చేసితిమి !

భటుఁడు:-అది నాకుఁ దెలియదు కాని, నిన్ను మా నవాబు గారికిఁ బెండ్లి చేయఁ దీసికొనిపోవుచున్నాము. నీయదృష్టము!

ఆపె కెవ్వునఁ గేక వేసి భూమిపై బడెను. స్మృతితప్పెను. ఈ కేక విని స్వర్ణ కుమారి లేచెను.ఆపె నాభటుఁడు పట్టు కొనఁబోయెను. ఆమెకూడ నట్లే కేక వేసెను. ఆ కేకలువిని యింతలో దండు చుట్టును జేరెను. సోమ శేఖర మూర్తిని గూతును స్వర్ణ కుమారిని, అందఱను బంధించి వేర్వేఱుగా దీసికొని ఎచటికో ప్రయాణమై పోయిరి.