పుట:Vijaya-Nagara-Samrajyamu.pdf/1

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూ డే మాటలు !

-

(1) దేశాభివృద్ధికి భాషాభివృద్ధి గొప్ప సాధనము. దేశములోని గ్రంథ సంగ్రహంబును వార్తాపత్రికలును నేదోయొక దైవిక కారణముచే, నేఁడు లేకుండనయ్యె నేని ఆ దేశము తన యాదిమ యుగములోని య నాగరికకు దిగునని చెప్పుట యతిశయోక్తి గానేరదు. దేశమునందలి వా వాజ్మయము ఆ దేశమునకు మేలుగాని కీడు గాని కలుగఁజేయఁగల యొక నిరంకుశాధికారి, యని చెప్పవచ్చును. ఇట్టి శక్తిగల వాజ్మకుమున దగిన గ్రంథములు లేని భాష.. శిశువులవచ్చి రాని పలుకులవంటి దై వ్యవహారమునకును జ్ఞానసంపాదనమునకు .పనికి రాకుండును.

(2) ఈ యు దేశమును మనము నందిడుకొని మేము దేశ చరిత్రలను, ప్రకృతి శాస్త్రములను, వ్యక్తి చరిత్రలను, చరిత్రవిషయక నవలలను, నీతిబోధక గ్రంధములను ప్రచురింప సమక ట్టితిమి. ఆ ప్రకారము విజ్ఞానచంద్రికా గ్రంథ మాల ఇప్పటికి 27 గ్రంథములు ప్రచురితము లైనవి. అందు 14 ప్రకృతిశాస్త్ర ములు, 5 దేశ చరిత్రలు, 4 వ్యక్తి చరిత్రలు, 4 నవలలు. ఇవియన్ని యుతజ్ఞులగు వారిచే వ్రాయఁబడినని, చిత్రపటములచే శోభిల్లుచుండును.సుందరమైన క్యాలికో బైండు చేయబడినవి.గ్రంథమాలరూపమున వెలువడునీ గ్రంధములనప్రసిద్ధ పామరుమని విద్వాంసుల అభిప్రాయము,

(3) ఈ గ్రంథములు జనసముదాయము కొనుటకు వీలగునట్లు బహుకొద్ది వెలల కిచ్చుచున్నాము. శాశ్వత పు చందాదారుల పద్ధతిని యమ్మబడును. మేము ప్రచురించు పుస్తక ములనన్నిటిని గొనువారు శాశ్వతపు చందాదాఱులు. 'అట్టి వారికి నూరు పుటలకు 0-8-0 ల చొప్పున ఇయ్యబడును. పోస్టేజి వేరు, ఇతరులకు పోస్టేజి గాక 0-6-0 లగును. ఇంతకుముందు ప్రచురింపఁబడిన గ్రంథములలో కనీసము మూడురూపాయల వెలగల గ్రంధములను కొనువారు ప్రవేశరుసు మియ్యనక్కర లేదు. వెనుకటి పుస్తకములను గొనక ముందు పుస్తకములను మాత్రము గొను నెడల 1-0-0 ప్రవేశరుసు మియ్యవలెను. పుస్తకముల వి.పి. గా పంపి సొమ్ము రాబట్టు కొందుము.

నవంబకు నెల.
1914.

ఆ. లక్ష్మీపతి, బి. ఏ. ఎం.బి. సి. ఎం.

మే నే జరు