పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీ వేంకటేశ్వర స్తుతిరత్నమాల

తాళ్ళపాక పెదతిరుమలాచార్యుఁడు

ఈతఁడు 18 - వ శతాబ్దము వాఁడు. తండ్రి ఆన్నమాచార్యులు, తల్లి అక్కమాంబ. జన్మస్థానము రాజంపేట తాలూకాలోని తాళ్ళపాక. ఈతనికృతులు శృంగార సంకీర్తనలు, అధ్యాత్మసంకీర్తనలు, శృంగార దండకము, చక్రవాళమంజరి, శృంగారవృత్తశతకము, శ్రీవేంకటేశోదా హరణము, నీతి సీస శతకము, సుదర్శనరగడ, రేఫఱకార నిర్ణయము, ఆంధ్ర వేదాంతము (ద్విపద), ఆంధ్రహరివంశము, భగవద్గీత (వచనము), వెంకటేశ్వరవచనములు, శ్రీవేంకటేశ్వరప్రభాత స్త్రవము, యావజ్జీవము పరమ భాగవతుఁడుగాఁ గాలక్షేపమొనర్చిన మహనీయుఁడు. ఈతనికి వేదాంతాచార్య , కవితార్కిక కేసరి , శరణాగతవజ్రపంజరబిరుదములు గలవు. *[1] శ్రీ వేంకటేశ్వరప్రభాత స్త్రవము పూర్తిగా నీక్రింద నీయబడినది.

శ్రీగురుం డర్థితో శేషాద్రి యందు
యోగనిద్రాకేళి నున్న యత్తఱిని
వనజాస నాది దేవత లేఁగుదెంచి
వినుతించి రప్ప డవ్విధ మెట్టి దనిన
శ్రీకర ! వేంకటక్షితిధరావాస !
నా కేంద్రనుత రమూనాథ మేల్కొనుము
వసుదేవదేవకీ వరగర్భజాత
కిసలయాధర రామకృష్ణ మేల్కనుము

  1. * 1845 సం||లో శ్రీవేంకటేశ్వర వచనములలో అచ్చయినది.