పుట:Venkateswara Sthuthiratnamaala Veturi Prabhakarasastri.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీవేంకటేశ్వరస్తుతిరత్నమాల 65 § సి! అభయంబు లిచ్చు మా యిభరాజవరదున T కుభయంబు లొనరింపు చున్న వారు వెఱపులు మాన్పు మా వేంకటేశ్వరునకుఁ జఅపులు భయభ_క్తి జఱపు వారు ఘనయోగిజనసమావనయోగి కనుమోల వినియోగములు సేయు పనుల వారు దురిత రుజౌఘవైద్యునికి హృద్యముగా ని వేద్యము లొసగంగ వేడు వారు గీ|| పరులఁ బొరి గొను జోదుకు పరులు నరుల దోసములు దోసు నయ్యకు దోనెలలరు నప్పనికి నప్పము లతిరసాధిపతికి నతిరసంబుల నిచ్చు వారైరి వరుస. సీ|| బడలినవారికి వడపప్ప పానకా లనఁటిపం డ్లో పినయన్ని గలవు యెళనీరు బిసనీరు లెందు హేరాళంబు నీరుచల్లఁ బెరు గపార మచటఁ గప్పరగంధంబు కైరవల్పట్టీలు తట్టుపునుంగును జట్టుపూవు లెందు వేడిన వెల్ల యేచప్పరంబున విప్పైన గొడుగులు విసనకబ్జ గీII లేలకులు శొంఠియును లవంగాలు పనస తొలలు చెఱుకులు ఖర్జూరఫలము లెన్ని వేడినను గొం డనుచు జాటు వేంకటేశు భక్తజాలంబు తిరునాళ్లప్రజకు నపుడు. 6